వరగడ్డి వాముకు నిప్పు అంటించిన దుండగులు
1 min read– మంటల్లో ఒక దూడ మృతి,5 మూగజీవాలకు గాయాలు,రెండు జీవాల పరిస్థితి విషమం -రైతుకు దాదాపు రెండు లక్షల నష్టం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వరిగడ్డి వాముకు గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించిన సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన బస్తిపాటి మల్లికార్జున స్వామప్ప తెలిపిన వివరాల మేరకు తన కల్లంలో వరిగడ్డి వాము మరియు కొట్టంలో నాలుగు ఎద్దులు,ఒక గేదె,ఒక దూడ ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి గడ్డి వాముకు నిప్పు అంటించడంతో వరిగడ్డి వాము మరియు కొట్టం మంటలు చెలరేగాయి.ఈమంటల్లో ఒక దూడ అక్కడికక్కడే మృతి చెందింది.మిగతా మూగజీవాలు ఆ మంటలకు తట్టుకోలేక కట్టి వేసినటువంటి వాటిని తెంపుకొని బయటికి వచ్చేశాయి.ఒక ఎద్దు ఒక దూడ పరిస్థితి విషమంగా ఉందని రైతు తెలియజేశాడు. రెండు లక్షల రూపాయలు మీర నష్టం వాటిల్లిందని అన్నారు.కర్నూలు నుండి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేయగలిగింది. తదనంతరం పశు వైద్యాధికారి జి.చంద్రమోహన్ గాయపడిన మూగజీవాలకు చికిత్స చేశారు.దూడ మృతి చెందడం పట్ల అంతేకాకుండా మూగజీవాలు గాయాలతో ఉండడం వాటిని చూసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని చెల్లించాలని వారు కోరుతున్నారు.