గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం
1 min read
పల్లెవెలుగు ,పత్తికొండ: గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే కే. ఈ. శ్యామ్ కుమార్ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. శనివారంకర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామంలో ఎంఎన్ఆర్జిఎస్ నిధులు 55 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల ను ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ కలిసి ప్రారంభించారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ స్వగ్రామం నలకదొడ్డి గ్రామంలో ఉరుసు సందర్భంగా మస్తానయ్య స్వామి దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, ఎంపీ బస్తిపాటి నాగరాజ్ మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ లో సిమెంటు రోడ్ల పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేశామని తెలిపారు. నలకదొడ్డి గ్రామానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా హంద్రీనీవా ద్వారా తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇంటింటికి తాగునీటి కొలయిలు ఏర్పాటు చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను కేటాయించినట్లు తెలిపారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా అందిస్తామని భరోసా ఇచ్చారు.