PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యలు తీర్చడమే వైఎస్ఆర్సిపి ధ్యేయం

1 min read

– వైసిపి మండల నాయకులు ప్రహల్లాద ఆచారి
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం ఫిబ్రవరి 14 పల్లెవెలుగు న్యూస్ : మండల కేంద్రమైన 9వ వార్డు జంగల్ కాలనీలో, ఉప్పరి కాలనిలో ఉన్న నీటి సమస్య నిమిత్తము ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సహకారంతో, ప్రహ్లాద్ ఆచారి ఆధ్వర్యంలో సర్పంచ్ పాల్ దినకర్ కొత్తగా వేసిన హ్యాండ్ బోర్ పంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సక్రీ తిక్కయ్య, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, మాజీ ఎంపిటిసి చౌదరి బసవ, మాజీ సర్పంచ్ అవతారం, హై స్కూల్ చైర్మన్ వడ్డే రామన్న, ఉమాపతి, వార్డ్ మెంబర్ రామకృష్ణ, సైమన్, చిన్న జంబయ్య, పెద్ద జంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author