PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ వ్యాఖ్యల ను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే

1 min read

– ప్రజలు మంగళగిరి లో లోకేష్ ను,బనగానపల్లె లో బిసి జనార్దన్ రెడ్డినీ ఓట్లతో  పీకి వేశారు

– అభివృద్ధి పై చర్చ కు ఎక్కడికి అయిన సిద్దమని  ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణం లోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో నిన్న జరిగిన యువ గళం నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా బనగానపల్లె పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బిల్డప్ బాబాయ్ అని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  కమిషన్ల రామిరెడ్డిని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  మాట్లాడుతూ నిన్న జరిగిన యువగళం నారా లోకేష్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరించాల్సింది పోయి వైఎస్ఆర్ పార్టీని స్థానిక ఎమ్మెల్యేను ఎద్దేవా చేయడం తప్ప చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన బహిరంగ సభలో బనగానపల్లె నియోజకవర్గం లో తాను కమిషన్లు తీసుకుంటున్నానని నారా లోకేష్ చెప్పడం విడ్డూరంగా ఉందని నారా లోకేష్ పక్కనే నిలబడ్డ 420 నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి టిడిపి కార్యకర్తల పనులు చేసిన బిల్లులో కమిషన్లు తీసుకోవడం బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని ముఖ్యంగా టిడిపి కార్యకర్తలకు, నాయకులకు తెలుసని చెప్పారు. 420 బీసీ జనార్దన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును 840 లోకేష్ మాట్లాడడం కనీస నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఆయన విధేయతకే వదిలి వేస్తున్నానని చెప్పారు.గత తెలుగుదేశం పార్టీ హయాంలో టిడిపి పార్టీ నాయకుల చేసిన పనులకే కమిషన్లు తీసుకున్నటువంటి  అప్పటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పారు. వారి కార్యకర్తల వద్ద కమిషన్లు తీసుకునేటువంటి నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి నీ పక్కన పెట్టుకుని తనకు కమిషన్ల రామిరెడ్డి అని పేరు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 2014 ఎన్నికల్లో  అప్పుడే తన మీద 22 కేసులు కబ్జా, 420 కేసులో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులకు అఫిడవిట్ సమర్పించినటువంటి ఘనత బీసీ జనార్దన్ రెడ్డి కి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసినటువంటి పనులకు బిల్లులు కూడా ఇప్పించుకోలేని అసమర్ధ  ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు చేసిన పనులు 40,000 వేల కోట్ల రూపాయలకు తమ వైయస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.గతఎన్నికల్లోతెలుగుదేశంపార్టీకార్యకర్తలు చేసినటువంటి పనులకు సంబంధించిన 30 కోట్ల రూపాయలను ఎన్నికల సమయంలో వాడుకున్న ఘన చరిత్ర బీసీ జనార్దన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అదే 2019 ఎన్నికల్లో గ్రామ గ్రామాన వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ వంతుగా చందాలు వేసుకునిగెలిపించినటువంటి ఘనత వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని అంతటిఅభిమానాన్నిసంపాదించినటువంటి వ్యక్తిగాకాటసానిరామిరెడ్డిఈరోజుగర్వపడుతున్నానని చెప్పారు. నీ కార్యకర్తల కష్టార్జితాన్ని నువ్వు దోచుకోవడం జరిగిందని అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.గత తెలుగుదేశం పార్టీ హయాంలో మండల అధ్యక్షులు, సర్పంచులు లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన సాగిందని ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూడా టిడిపి పార్టీకి ఆనాడు లేదని చెప్పారు. టిడిపి పార్టీ చేసినటువంటి కార్యకర్తల బిల్లులు కూడా వచ్చిన తర్వాత కూడా వారికి ఇవ్వకుండా ఆ బిల్లులు అందిస్తే వారు ఎక్కడ వైఎస్ఆర్ పార్టీకి జంప్ అవుతారు అని చెప్పి కుళ్ళుతో కుళ్ళు, కుతంత్రాలతో కార్యకర్తలను కూడా మోసం చేసినటువంటి ఘనత బీసీ జనార్దన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. నీరు చెట్టు పేరుతో వందల కోట్ల రూపాయలు పనులు చేయకపోయినా చేసినట్లు చూపించుకుని ఆ డబ్బులను స్వాహా చేసిన ఘనత బీసీ జనార్దన్ రెడ్డిది అని కేవలం నియోజకవర్గంలో కార్యకర్తలకు, నాయకులకు సిసి రోడ్లు మాత్రమే అప్పజెప్పడం జరిగిందని నీరు చెట్టు పేరుతో డైరెక్టుగా బీసీ జనార్దన్ రెడ్డి దోపిడీ వ్యాపార ధోరణితో చేసినాడు అని చెప్పారు. ఎక్కడైనా నాయకుడు అన్న తర్వాత తనను నమ్ముకుని ఉన్నా కార్యకర్తలు బాగుపడాలని చూస్తారు .కానీ లాభాలు వచ్చే నీరు చెట్టు కార్యక్రమం మాత్రం పనులు ఎమ్మెల్యే తన సోదరులు చేయడం జరిగిందని కార్యకర్తలకు  మాత్రం సిసి రోడ్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు.బనగానపల్లె గ్రామపంచాయతీలో టీడీపీ ప్రభుత్వ హయం లో మోనార్కు పరిపాలన సాగిందని అప్పటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి  తమ్ముడు బీసీ రాజారెడ్డికి గ్రామపంచాయతీ తో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ గ్రామపంచాయతీ వ్యవస్థను తన ఇంటి వద్ద నుంచే నడిపించిన ఘనత బీసీ రాజారెడ్డికి, బీసీ జనార్దన్ రెడ్డికే దక్కిందని చెప్పారు. పట్టణంలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అప్పటి రాజారెడ్డిని కలవందే మాత్రం ఏ ఒక్క పని కూడా జరిగేది కాదని పట్టణంలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్న కూడా బీసీ రాజారెడ్డి చెప్పిన మేస్త్రీలకు ఇస్తేనే ఆ ఇండ్లకు ఇంటి నిర్మాణ మంజూరు చేసేవాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు కూడా తాను చేసిన బిల్లులు మంజూరు కాలేదని కోర్టుకు వెళ్లి డబ్బులు తీసుకున్న వ్యక్తి  బీసీ జనార్దన్ రెడ్డిని మాత్రమే చూస్తున్నానని చెప్పారు.నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రవ్వలకొండ మోడల్ స్కూల్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఆనాడు అధికారం మధం తో బ్లాస్టింగ్లు చేసి మైనింగ్ చేసినటువంటి ఘనత ఆనాటి బీసీ జనార్దన్ రెడ్డి అని తనకు అన్ని అనుమతులు ఉన్నా కూడా బ్రహ్మంగారి గుహలు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే తనకు లీజులు ఉన్నప్పటికీ కూడా అక్కడ మైనింగ్  ఆపేయడం జరిగిందని చెప్పారు. ఆనాడు గాలేరు – నగరి కాలవ తవ్వకల్లో వచ్చినటువంటి రా మెటీరియల్ అంతా తనకు సంబంధించినటువంటి క్రషర్ కు తరలించి దాదాపుగా 50 నుంచి 60 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగిందని ఈ విషయం గురించి తాను గవర్నర్ కు, విజిలెన్స్ వారికి కూడా ఫిర్యాదుచేయడంజరిగిందనిచెప్పారు.బనగానపల్లె పట్టణంలో అక్రమ లేఔట్లు సృష్టించి తాను ఎకరాకు 20 లక్షల రూపాయలు తీసుకోవడం జరుగుతుందని ఈ 420 జనార్దన్ రెడ్డి 840 లోకేష్ కు చెబితే బహిరంగ సభలో అదే లోకేష్ విచారణ కూడా చేయకుండా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అక్రమ లేఔట్ లు ఏర్పాటు చేసిన నాయకుడినే పక్కన పెట్టుకునీ  సభలో చెప్పడం నవ్వొస్తుందని చెప్పారు. బీసీ గుర్రెడ్డి కాలనీ లో అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించి మొత్తం లేఔట్ లు వేసి అక్రమంగా కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టడం నిజం కాదా అని చెప్పారు. తనకు సంబంధించినటువంటి ఏడు ఎకరాల్లో లేఔట్లు వేసి ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అయితే తనకు ఎకరాకు 20 లక్షల రూపాయలు అక్రమ లే ఓట్లకు రియల్ ఎస్టేట్ వాళ్లు ఇవ్వడం జరుగుతుందని నిన్న లోకేష్ చెప్పిన సభలో గుర్తు చేస్తూ మరి బీసీ జనార్దన్ రెడ్డి వేసినటువంటి ఏడు ఎకరాల్లో అక్రమ లేఔట్లకు తనకు ఎంత డబ్బు ఇచ్చాడో చెప్పాలని బిసి కి కాటసాని సవాల్ విసిరారు. నీవు మాత్రం నీ అగ్రికల్చర్ ల్యాండ్ ను కమర్షియల్ ల్యాండ్ గా కన్వర్ట్ చేయకుండానే లేఔట్లు వేసి అమ్ముకోవచ్చని అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం అలాంటి పనులు చేస్తే తప్పు అని చెప్పడం నీకు ఒక న్యాయం – బయటి వారికి ఒక న్యాయమా అనీ చెప్పారు.ఏపీ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ పోస్టులకు కమిషన్లు కాటసాని రామిరెడ్డి తీసుకున్నాడు అని చెప్పి నిన్న లోకేష్ చెప్పడం జరిగిందని అయితే 2015 వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన కోయిలకుంట్ల మండలంలో గుల్లదుర్తి గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని ఆపరేటర్ పోస్ట్ ఇస్తానని అతనికి ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన నాగరాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆ వార్త ఆనాడు అన్ని దినపత్రికల్లో రావడం జరిగిందని మరి ఆపరేటర్ పోస్టులకు ఎవరు డబ్బులు తీసుకున్నారో బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే కాటసాని తెలిపారు .అవుకు మండలం చెర్లోపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ పాల్పడడం జరిగిందని లోకేష్ చెప్పడం జరిగిందని అయితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే చెర్లోపల్లి గ్రామంలో బీసీ జనార్దన్ రెడ్డి చిన్నాయన పక్కిరా రెడ్డి 707 సర్వే నెంబర్ ఎస్ఆర్బిసి భూముల్లో అక్రమంగా మైనింగ్ చేసిన విషయం నిజం కాదా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మైనింగ్ పోయే రస్తాలను కూడా అడ్డుకొని లక్షల రూపాయలు డబ్బు సొమ్ము చేసుకున్న విషయం నిజం కాదా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆఖరికి టిడిపి పార్టీ నాయకుల, కార్యకర్తల నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన విషయం నిజం కాదా అని చెప్పారు.2018లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి టిడిపి పార్టీ నాయకులు మరియు కొంతమంది మైనింగ్ చేయడం వల్ల ప్రభుత్వం నాలుగు కోట్ల 28 లక్షల రూపాయలు పెనాల్టీ వేయడం జరిగిందని అయితే ఆనాడు వారంతా తన వద్దకు రావడంతో ఆనాటి మంత్రితో మాట్లాడి తాను ఒక కోటి 28 లక్షల రూపాయలకు పెనాల్టీ వారి నుంచి కట్టించడం జరిగిందని వారికి ఆ విధంగా సహాయం చేస్తే తాను కమిషన్లు తీసుకున్నాను అని చెప్పి చెప్పడంవిడ్డూరంగాఉందనిచెప్పారు.నంద్యాలలో లక్ష్మీదేవి అనే మహిళ తనవల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగిందని లోకేష్ చెప్పడం జరిగిందని అయితే లోకేష్ కూడా వివరాలు అన్ని సేకరించి బహిరంగ సభల్లో మాట్లాడాలని మతిస్థిమితం లేని మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పారు. బందార్ల పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి తన కుటుంబ సభ్యులతో పాటు తమ సోదరులు కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందని అయితే ఆ డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగిందని అయితే శ్రీనివాస్ రెడ్డి పెదనాన్న వీరారెడ్డి కి సంబంధించిన ఆస్తిని తాను కొనుగోలు చేస్తే ఆమె తనకి ఎక్కడ డబ్బులు కట్టవలసి వస్తుందో అని తన మీద అపనింద వేయడం జరిగిందని అందుకు ఆ రోజే నంద్యాలలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని మరి దానికి లక్ష్మీదేవి అనే మహిళ వివరణ కూడా ఇవ్వలేకపోయిందని ఈ సందర్భంగా తెలిపారు.బనగానపల్లె పట్టణంలో మైనారిటీలకు సంబంధించినటువంటి షాది ఖానాకు బీసీ జనార్దన్ రెడ్డి 35 లక్షలు ఇవ్వడం జరిగిందని నిన్న బహిరంగ సభలో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆ ఇచ్చినటువంటి డబ్బును మళ్ళీ వారి టిడిపి పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడు కలాం వారి పేరు మీద విత్డ్రా చేసుకోవడం నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేశారు. డబ్బులు బీసీ జనార్దన్ రెడ్డి విత్ డ్రా చేసుకున్న ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. బనగానపల్లె పట్టణ మైనారిటీ కుటుంబాల మీద బీసీ జనార్దన్ రెడ్డి అతని సోదరులు కపట ప్రేమ చూపిస్తున్నారని వారి కపట ప్రేమను టిడిపి పార్టీకి చెందినటువంటి కొంతమంది మైనారిటీ సోదరులే ఇప్పటికే గ్రహించడం జరిగిందని ఇంకా రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో వారి కపట ప్రేమ బయటపడటం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె పట్టణ ముస్లిం సోదరులు అంటే తనకు పంచప్రాణాలు అని చెప్పే బీసీ జనార్దన్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లిం కుటుంబాల కోసం ఏ ఒక్క పని అయినా చేశావా అని చెప్పి నిరూపించగలవా అని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డికి కాటసాని రామిరెడ్డి గారు సవాల్ విసిరారు. అదే తాను ముస్లిం మైనార్టీ సోదరుల కొరకు మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈద్గా అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి ఆనాడే 30 లక్షల రూపాయలతో ప్రహరీ కూడా నిర్మించి ఈద్గాను కాపాడడం జరిగిందని చెప్పారు. అలాగే అలాగే రెండవసారి శాసనసభ్యుడుగా అయిన తర్వాత మాసుం భాష దర్గా స్మశాన వాటిక అన్యాక్రాంతం కాకుండా 69 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అలాగే తన సొంత ఖర్చులతో షియా మతస్తులకు చెందిన ఇబాదత్ ఖానాను 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించడం జరుగుతుందని వాటిని కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె పట్టణంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ఇంటి స్థలాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు తెలుసని అయితే మరి ముస్లింలు తనకు పంచప్రాణాలని చెప్పుకునే బీసీ జనార్దన్ రెడ్డి పేదలకు 3,000 మంది కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే వాటికి అడ్డుపడి ఆ నిరుపేద అర్హులైన ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ఇంటి స్థలాలు రాకుండా అడుగడుగునా ఇప్పటికి అడ్డుపడుతున్న సంగతి నిజం కాదా అని చెప్పి చెప్పారు.అదే తనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎస్ఆర్బిసి కి సంబంధించిన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని అమ్ముకుంటే వారి మీద ఫిర్యాదు చేస్తే తప్పు చేసిన వ్యక్తులను బీసీ ఇంట్లో పెట్టుకున్న సంగతి నిజం కాదా అని చెప్పారు. పట్టణంలో SRBC వద్ద 3,000 మంది కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే SRBC కట్ట తెగిపోతుందని వాటి వల్ల ఆ ఇండ్లు కొట్టుకుపోతాయని చెప్పే బీసీ జనార్దన్ రెడ్డి, లోకేష్  ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఇండ్లు కృష్ణానది ఒడ్డు మీద కర్రకట్ట మీద నిర్మించుకున్న సంగతి గుర్తుకు  తెచ్చుకోవాలని చెప్పారు. నేను కమిషన్లు తీసుకున్నానని పదేపదే 420 బిసి, 840 లోకేష్ చెప్పడం జరిగిందని అయితే నేను కమిషన్ లు తీసుకున్నట్టు రుజువు చేసే దమ్ము లోకేష్ కు గాని బీసీ జనార్దన్ రెడ్డి కి గాని ఉందా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనార్దన్ రెడ్డిని బనగానపల్లె నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగిందని మరి ఆనాడు బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఎందుకు ఇవ్వలేక పోయావని అసలు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆలోచన ఎందుకు నీకు రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న బీసీ జనార్దన్ రెడ్డి మరి పేదలకు ఎందుకు ఇంటి స్థలాలు ఇవ్వలేకపోయావని ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్లను సైతం ప్రజలకు ఉపయోగపడకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘనత బీసీ జనార్దన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు.కొలిమిగుండ్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇవ్వడం వల్ల ఆ భూములు ఏవైనా కంపెనీలకు వెళితే ఆ కంపెనీలు ఆ పేదలకు డబ్బులు ఇచ్చి కొనడం జరుగుతుందని అలాంటి భూ పంపిణీ కార్యక్రమం పేదలకు ఇవ్వాలని తలిస్తే ఆ భూములు ఇవ్వడం వల్ల కాటసాని రామిరెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఈర్ష, ద్వేషాలతో రాజకీయ కక్షలతో నీవు హైకోర్టుకు వెళ్లి పేదలకు భూ పంపిణీ చేయకుండా చేసిన ఘనత బనగానపల్లె నియోజకవర్గంలో నీకే దక్కుతుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన కూడా  ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేదలకు భూ పంపిణీ చేస్తే మంచిదా లేక పెత్తందారులకు భూములు కట్టబడితే మంచిదా అని నేను ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డినీ అడుగుతున్నాను అని చెప్పారు. కొలిమిగుండ్ల మండలంలో పేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేస్తుంటే అక్కడ మైనింగ్ ఖనిజాలు ఉన్నాయని అవి ఫ్యాక్టరీలకు పనికొస్తుందని ఫ్యాక్టరీలకు ఆ భూముల అప్పజెప్పాలని అక్కడ భూ పంపిణీ చేయకుండా అడ్డుపడడం జరిగింది మరి బనగానపల్లె మండలంలోని యనగండ్ల గ్రామం వద్ద మహా సిమెంట్ ఫ్యాక్టరీ భూములు లీజుకు అప్లై చేస్తే ఆ భూములు లీజులు ఇవ్వకూడదని కొంతమంది వారి పార్టీ అనుచరులతో కలిసి అక్కడ అడ్డుపడ్డ సంగతి ప్రజలు మర్చిపోలేదని చెప్పారు.నేను బీసీ జనార్దన్ రెడ్డికి ఒకటే సవాలు విసురుతున్నానని నువ్వు పేదల పక్షాన ఉంటున్నావా లేదా పెత్తందారి వ్యవస్థ తరపున ఉంటున్నావో ప్రజలకే సమాధానం చెప్పాలని చెప్పారు.యువగళం పాదయాత్రలో లోకేష్ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పక్కన పెట్టడం జరిగిందని చెప్పడం బనగానపల్లె పట్టణ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తుందని 22 కోట్ల రూపాయలతో తాను అధికారంలోకి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి త్వరలోనే ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుందని అలాంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం లేదని  చెప్పడం లోకేష్ కు నియోజకవర్గ సమస్యల మీద అభివృద్ధి మీద ఎంత మాత్రం అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ఇలాంటి వ్యక్తి మన బనగానపల్లె నియోజకవర్గాన్ని టిడిపి పార్టీ అధికారంలోకి వస్తే తాను చూసుకుంటానని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి లోకేష్ గుర్తు చేసుకోవాలని చెప్పారు.వైయస్సార్ పార్టీకి చెందినవారు అక్రమ బియ్యం వ్యాపారం చేసి కర్ణాటక తరలిస్తున్నారని లోకేష్ చెప్పడం జరిగిందని అయితే తన పక్కన నిలబడ్డ బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులే గత ఆరు సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేసి వారిని డాన్లుగా సృష్టించినటువంటి ఘనత మీ బీసీ జనార్దన్ రెడ్డికే దక్కుతుందని అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని కాటసాని రామిరెడ్డి గారి అనుచరులు బియ్యం వ్యాపారం చేస్తున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పారు.

బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీ హాయంలో రింగురోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి లోకేష్ బాబు చెప్పడం జరిగిందని అయితే ఆనాడు కేవలం రింగ్ రోడ్డు శాంక్షన్ అయిందని మాత్రమే చెప్పడం జరిగిందని తమ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి రింగురోడ్డులో పోతున్నటువంటి రైతులకు భూ సేకరణ విషయంలో ప్రభుత్వం ఎన్నోసార్లు రైతులతో మాట్లాడి వారికి ఒక రేటును నిర్ణయించి భూసేకరణ చేపట్టడం జరిగింది అని తమ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే జరిగిందని మరి కేవలం పేపర్లలో అట్టహాసంగా చెప్పుకోవడం కాదని క్షేత్రస్థాయిలో వారికి అందించాల్సినటువంటి నష్టపరిహారాన్ని అందించిన తరువాతనే పనులు మొదలు పెట్టడం జరగాలని కేవలం ఓట్ల కోసం ఆనాడు 2019లో బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేసి అట్టహాసంగా చేయడం జరిగిందని కానీ ఆరోజు ఆ రింగురోడ్డు కోసం ఒక్క నయా పైసా కూడా నిధులు మంజూరు కాలేదని చెప్పారు.  ఎందుకు రింగురోడ్డు మొదలు పెట్టలేకపోయాడో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. భూసేకరణ కార్యక్రమం త్వరలోనే పూర్తి అవుతుందని ఆ తర్వాత రింగ్ రోడ్డు నిర్మాణానికి తాను భూమి పూజ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే చేయడం జరుగుతుందని చెప్పారు.షాది ఖానా విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి మరి ముస్లింల కొరకు ఎందుకు షాది ఖానా పని పూర్తి చేయలేకపోయావని ఎమ్మెల్యే కాటసాని గుర్తు చేశారు. ముస్లిం ప్రజల్లో మాత్రం తాను షాది ఖానాకు 30 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్టు ప్రకటించడం జరిగిందని ఆ తర్వాత ముస్లిం మైనార్టీ నాయకుడు కలం అకౌంట్ ద్వారా 30 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకున్నటువంటి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తమ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక కోటి 30 లక్షల రూపాయలతో షాది ఖానా నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు మొదలుపెట్టడం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె పట్టణంలోని ముస్లిం ప్రజలకు ఇంకెన్నాళ్లుమోసంచేస్తావనిచెప్పారు.బనగానపల్లె పట్టణంలోని కొండ పేటలో గల వెంకటేశ్వర స్వామికి టీటీడీ తరఫున తాను నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అయితే ఇంకా రెండు కోట్ల రూపాయలు టిటిడి దేవస్థానం వారికి డిపాజిట్ చేస్తే వారు ఆరు కోట్ల రూపాయలతో ఎంతో సుందరంగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అందుకు  వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పరిరక్షణలో భక్తుల చేత విరాళాలు తీసుకోవడం జరుగుతుందని వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి తన వంతుగా 12 లక్షల రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు విరాళంగా  అందించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా తమ కాటసాని కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపుగా 35 లక్షల రూపాయలు విరాళాల రూపంలో ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆలయ నిర్మాణాలకు  ఎప్పుడూ కూడా తమ కాటసాని కుటుంబ సభ్యులు ఎవరు అభివృద్ధి చేసినా అడ్డుపడడం జరగదని అది కేవలం బీసీ కుటుంబానికి మాత్రమే చెల్లుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందివర్గం గ్రామంలో ఈశ్వర ఆలయం భక్తుల విరాళాలతో సేకరించి నూతన ఆలయ నిర్మాణం చేపడితే ఆ ఆలయ ప్రారంభోత్సవం చేయకూడదని రాజకీయ కక్షతో ఆ ఆలయ ప్రారంభోత్సవానికి ఎన్నో అడ్డంకులు సృష్టించిన ఘనత ఒక బీసీ జనార్దన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు.ఇక మీరాపురం గ్రామంలో గనులు చేసుకుని పేద కుటుంబ ప్రజలు జీవనం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందని అయితే వారిని అడ్డుపెట్టుకొని మహా సిమెంట్ యాజమాన్యంతో ఐదు కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యంతో డబ్బు తీసుకున్న ఘనత బీసీ జనార్దన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఐదు కోట్ల రూపాయలు తీసుకున్న సంగతి మీరాపురం గ్రామంలోని ప్రజలందరికీ తెలుసని చెప్పారు.బనగానపల్లె పట్టణానికి వచ్చాను ఏం పీకుతావో పీక్కో అని అనుచిత వ్యాఖ్యలు చేయడం లోకేష్ కు సరికాదని చంద్రబాబు నాయుడు తన కుమారుడైన లోకేష్ కు హితపు చెప్పుకోవాలని లేదంటే తన పాదయాత్ర ముగిసే సమయానికి ఎక్కడో ఒకచోట లోకేష్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  గుర్తు చేశారు.మంగళగిరిలో లోకేష్ ను బనగానపల్లె నియోజకవర్గం లో బీసీ జనార్దన్ రెడ్డిని ప్రజలు ఎప్పుడో పీకేసారని ఇంకా తాను పీకాల్సిన అవసరం ఏమీ లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు.

About Author