NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ని పరామర్శించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం DRDA శాఖకు చెందిన వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ తిరుపాల్ రెడ్డిఈనెల 21వ తేదీన నంద్యాలలో మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆయనకు గాయాలు అవడం జరిగింది. ప్రమాదం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు నంద్యాలలో నివాసం ఉంటున్న తిరుపాల్రెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు బండి బ్రహ్మానందరెడ్డి, యామ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిచేసే అధికారి మన వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ తిరుపాల్ రెడ్డి గారు అని చెప్పారు. ప్రతిరోజు ఈ వెలుగు శాఖలో పొదుపు సంఘాలకు చెందిన ఎన్నో సమస్యలు ప్రతిరోజూ ఉంటాయని అలాంటి సమస్యలను ఎంతో చాకచక్యంగా పరిష్కారం చేసే అధికారి తిరుపాల్రెడ్డి అని అలాంటి అధికారికి ప్రమాదం జరగడం చాలా దురదృష్టం అని చెప్పారు. అతను త్వరగా కోలుకోనీ విధులకు హాజరు కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

About Author