విదేశాల నుంచి వచ్చే డబ్బు తగ్గింది !
1 min readపల్లెవెలుగువెబ్ : కొవిడ్ ప్రభావం ప్రవాస భారతీయుల నిధులపైనా పడింది. ఈ మహమ్మారి దెబ్బతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ సహకార కూటమి దేశాల్లోని ప్రవాస భారతీయులు.. స్వదేశానికి పంపే నిధుల మొత్తం భారీగా తగ్గింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఆర్‌ఐల నుంచి మన దేశానికి వచ్చిన నిధుల్లో 50 శాతానికిపైగా ఈ దేశాల నుంచే వచ్చింది. 2020-21లో ఇది ఏకంగా 30 శాతానికి పడిపోయినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్,సింగపూర్ వంటి సంపన్న దేశా ల్లోని ఎన్‌ఆర్‌ఐలు పంపే నిధులు 36 శాతానికి చేరాయి.