రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది: కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముస్లింలందరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో టీజీ భరత్ పాల్గొన్నారు. ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించి రోజా ఉపవాస దీక్షను ఆయన విరమింప చేశారు. అనంతరం వారితో కలిసి టీజీ భరత్ ప్రార్థనలో పాల్గొన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని భరత్ చెప్పారు. కర్నూలు ప్రజలపై అలా దీవెనలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు టిజి భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ భాష, మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, మైనార్టీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, జనసేన అసెంబ్లీ ఇంచార్జి ఆర్షద్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.