ఉద్యమ సదస్సును జయప్రదం చేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల : ఆర్.సి.సి బెళగల్ మండల అధ్యక్షుడు వీరన్న, రాయలసీమ కళావేదిక జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్ లు గాజులదిన్నె దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బైక్ యాత్ర ప్రారంభించారు.ఈ యాత్ర గూడూరు, కోడుమూరు మీదుగా గోనెగండ్ల మండల కేంద్రానికి చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు. తదనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యదర్శి సద్దాం మాట్లాడుతూ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాయలసీమ సమగ్ర అభివృద్ధికై పోరాడుతామంటూ రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేసి సమానమైన నీటి వాటా సమానమైన ఉద్యోగాలు సమానమైన రాజ్యసభ స్థానాలు శాసనసభ స్థానాలు ఒప్పందాన్ని నెరవేర్చాలని కోరారు . అంతేకాక ప్రభుత్వాలకు రాయలసీమ పైన ఉన్న నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు మా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు నీటిని మాకే కేటాయించాలని ఈ ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న విద్యార్థులు అందరూ కదలి రావాలని రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమైతేనే తప్ప నిరుద్యోగులకు రైతులకు కార్మికులకు రైతు కూలీలకు న్యాయం జరగదని వాపోయారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి, భాస్కర్, దిలీప్, సామేలన్న, సంఘాల ఆంజనేయులు,బాలరాజు, మద్దిలేటి రైతులు తదితరులు పాల్గొన్నారు.