PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా బాగా లేద‌ని.. నిప్పంటించిన అభిమానులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన బీస్ట్ సినిమాకు పొద్దుటినుంచే నెగెటివ్‌ టాక్‌ స్టార్ట్‌ అయింది. సినిమా రంజుగా లేదంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్‌. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో వెనుదిరిగి రావాల్సి వస్తోందంటూ దిగులుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్‌ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంత నచ్చకపోతే మాత్రం మరీ థియేటర్‌కు నిప్పంటిస్తారా? అని మండిపడుతున్నారు కొందరు నెటిజన్లు.

                                  

About Author