న్యాయవాది హత్య దారుణం.. నిరసిస్తూ న్యాయవాదుల రాస్తోరోకో
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఢిల్లీలో న్యాయవాది హత్య దారుణమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం న్యాయవాది హత్య, రాజమండ్రిలో మరో న్యాయవాదిపై పోలీసులు అక్రమ కేసు బనాయించడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదులు సంఘం ఆధ్వర్యంలో “రాస్తా రోకో”చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై న్యాయవాది వీరేంద్ర నర్వాల్ ను అత్యంత అమానుషంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి బార్ అసోసియేషన్ యువ న్యాయవాది దుగ్గిరాల సుభాష్ పై పోలీసులు దాడి పోలీసు విధులకు ఆటంకపరిచారని న్యాయవాదిపై తప్పుడు కేసు నమోదు చేయటం లాంటి సంఘటనలు అత్యంత దారుణమని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో లాగా న్యాయవాదుల రక్షణ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్. కృష్ణయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక కోర్టు విధులు బహిష్కరించి స్థానిక నాలుగు స్తంభాలు దగ్గర ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున “రాస్తా రోకో”కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన “రాస్తా రోకో”కార్యక్రమన్ని ఉద్దేశించి పత్తికొండ బార్ అసోసియేషన్ సీనియర్ ,న్యాయవాదులు పి. ఎల్ల రెడ్డి, బి. సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల దాడులు అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఈ రెండు కేసుల్లోనూ దుండగులను తక్షణమే అరెస్టు చేసి, పోలీసులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని లేనిచో న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఏ. సత్యనారాయణ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. రంగ స్వామి,వైస్ ప్రెసిడెంట్ దామోదర ఆచారి,ట్రెజరర్ మహేష్, జాయింట్ సెక్రటరీ జె. రవి కుమార్, న్యాయవాదులు పి. నాగభూషణ రెడ్డి, పి. బదిరి నారాయణ,ఎం. చంద్ర శేఖర్ నాయుడు, కె. నరసింహయ్య,ఎం. మల్లికార్జున,బి. రమేష్ బాబు, డి. బాల భాష, వై. మధు బాబు,ఎం. అశోక్ కుమార్, నెట్టేకల్లు,ప్రసాద్, రవి ప్రకాష్,వై. శ్రీనివాస రెడ్డి, కె. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.