NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గిరిజన బాలుడి హత్య….48 గంటల్లో చేదించిన జిల్లా పోలీసులు..

1 min read

పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు నిర్ధారణ..

సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ  డి.మేరీ ప్రశాంతి

 పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  బుట్టాయగూడెం మండలం, పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో  10.07.2023 వ తేది సోమవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వసతిగృహం లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్ది గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి S/o శ్రీనివాస్ రెడ్డి, 9 సంవత్సరాలు, C/ST-కొండరెడ్డి, ఉర్రింక గ్రామం, బుట్టాయగూడెం మండలం అనువానిని బయటకు తీసుకువెళ్ళి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర  వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని పై బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ CR.No 125/2023 U/s 302 IPC కేసునమోదు చేయబడింది. ఈ కేసు ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర డి.జి.పి  కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి వారి ఆదేశాల పై , ఏలూరు జిల్లా డి.ఐ.జి. జి.వి.జి. అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పి డి మేరి ప్రశాంతి  స్వీయపర్యవేక్షణలో, MJV భాస్కరరావు అదనపుఎస్పి ఏలూరు జిల్లా,పోలవరం DSP ఎ.శ్రీనీవాసులు  ఆద్వర్యంలో  సబ్ డివిజన్ పరిదిలోని CI లు, SI లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముద్దాయిలు కోసం విసృతమైన గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వీరికి అదనంగా మరికొంతమంది అధికారులను నియమించి దర్యాప్తు వేగవంతం చేసి అన్ని కోణాల్లోదర్యాప్తు చేసి ముద్దాయిల ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గురువారం 13.07.2023నాడు జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.వెంకటేశ్వర రావు వాహనతనిఖిలలో భాగంగా పైకెసులో గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి ని హత్యచేసి పరారిలో ఉన్నఇద్దరు Juveniles in Conflict with Law లను అదుపులోకి తీసుకోవడం జరిగింది.  పాత కక్షలను నేపధ్యంలో హత్య చేసినట్లు, విచారణలో తేలింధన్నరు. వారు ఇద్దరు కుడా అదే స్కూల్లో చదువుతున్నట్లు విచారణలో తేలింది అన్నారు. కేవలం  48 గంటల వ్యవధిలో ఈ కేసును  చేదించిన పొలిసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్ పి  డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ సిబ్బందిని  అభినందించారు.

About Author