మంత్రి పేర్ని నానికి ఆర్జీవి ప్రశ్నల వర్షం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మంత్రి పేర్నినానికి ప్రశ్నల బాణాలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని కోరారు.
- సినిమాతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఎంతమేరకు ఉంటుంది?.
- గోధుమలు, బియ్యం, కిరోసిన్, వంటనూనె వంటి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయిస్తాయని తెలుసు. అయితే, అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది? సినిమా టికెట్ల ధరను ప్రభుత్వమే నిర్ణయించే విధంగా దారి తీసిన పరిస్థితులేంటి?.
- పేదలకు సినిమా చాలా అవసరమని మీరు భావిస్తే.. విద్యా, వైద్యసేవలకు రాయితీ ఇస్తున్నట్లు సినిమాలకీ రాయితీ ఇవ్వొచ్చు కదా? .
- పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులు ఉన్నట్లే.. రేషన్ థియేటర్ల ఏర్పాటును పరిగణనలోకి తీసుకొని అటువంటి ఆలోచనలు చేస్తారా?. అంటూ ప్రశ్నలు సంధించారు. వీటికి ఏపీ మంత్రి పేర్నినాని సమాధానం చెప్పాలని కోరారు. ప్రభుత్వం స్పందిస్తుందో.. లేదో వేచిచూడాలి.