NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కమిషనర్​

1 min read

– రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసిన
– ఏలూరు కార్పొరేషన్ నూతన కమిషనర్ సంక్రాంతి వెంకట కృష్ణ
పల్లెవెలుగు వెబ్​ ఏలూరు : ఏలూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని , నగర సుందరీకరణ తో పాటు నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పరిశుభ్రతకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు.ఏలూరు కార్పొరేషన్ నూతన కమిషనర్ గా ఇటీవల భాద్యతలు చేపట్టిన సంక్రాంతి.వెంకట కృష్ణ శనివారం ఏలూరు శ్రీరామ్ నగర్లోని మాజీ డిప్యూటి సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కాలుష్య కారకమైన ప్లాస్టిక్ వస్తువులపై బ్యాన్ విధించి నప్పటికి ఇంకా కొన్ని చోట్ల చలామణిఅవుతున్నాయని ,వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ఏలూరు నగరంలోని పార్కుల్లో నగర ప్రజలకు ఆహ్లాద కర వాతావరణం అందించేలా చర్యలు చేపట్టడంతో పాటు స్మశాన వాటికల్లో సైతం మౌలిక సౌకర్యాలు మెరుగు పర్చేలా చర్యలు చేపట్టాలంటూ ఆళ్ల నాని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు నగర డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, కో-అప్షన్ సభ్యులు ఎస్ ఎo ఆర్ పెదబాబు పాల్గొన్నారు.

About Author