జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన జిల్లా ఎస్పీ
1 min read– అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. స్ధానిక కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సమయంలో జిల్లాలో శాంతి భధ్రతలకు సంబంధించిన అంశాల గురించి కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డి. మేరీ ప్రశాంతికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.