రాబోయే ప్రభుత్వం మాదే.. కూల్చే అవసరం లేదు : అమిత్ షా
1 min readపల్లెవెలుగు వెబ్ :రాజస్థాన్ రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని అన్నారు. తాము ప్రజాభిప్రాయాన్ని కోరుతామని, వచ్చే ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. 2023లో రాజస్థాన్ లో తమదే అధికారమని అన్నారు. గరీబీ హఠావో అని ఇందిరా గాంధీ నినదించినా.. పేదరికం పోలేదని, నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాకే పేదరికం తగ్గుముఖం పడుతోందని అభిప్రాయపడ్డారు.