అమ్మాయిల సంఖ్య అనంతపురంలో తక్కువ.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది.