దేశంలో థియేటర్ల సంఖ్య తగ్గుతోంది !
1 min readపల్లెవెలుగువెబ్: ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ లో సినిమా థియేటర్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని అన్నారు. ఐదారు సంవత్సరాల క్రితం దేశంలో 12 వేల సినిమా థియేటర్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 8 వేలకు పడిపోయిందని తెలిపారు. అదే సమయంలో చైనాలో సినిమా హాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని, ఐదారేళ్ల కిందట చైనాలో 10 వేల థియేటర్లు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పెరిగిందని అన్నారు. ఈ కారణంగానే భారతీయ చిత్రాలు దేశంలో కంటే చైనాలో అధికంగా ప్రదర్శితమవుతున్నాయని అపూర్వ చంద్ర వెల్లడించారు. మన సినిమాలకు ఇక్కడి కంటే చైనాలో అధిక బిజినెస్ లభిస్తోందని తెలిపారు.