కలెక్టరేట్ లోని కార్యాలయాలు , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి…
1 min read
జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ…
కర్నూలు , న్యూస్ నేడు: కలెక్టరేట్ లోని కార్యాలయాలు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయ సముదాయం లోని కార్యాలయాల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కోరారు.సోమవారం సాయంకాలం డిఆర్ఓ ఛాంబర్ లో కలెక్టరేట్ లోని కార్యాలయాల అధికారుల సమావేశం నిర్వహించి అన్ని కార్యాలయాలలో ఫైల్స్ దుమ్ము – ధూళి , బూజు లేకుండా చూసుకోవాలని అందుకు కార్యాలయంలోని అటెండర్ లను బాధ్యులుగా చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు కార్యాలయాల వెలుపల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తు మరియు రెండవ అంతస్తులలో ఉన్న కార్యాలయాల కిటికీ ల నుండి చెత్త బయటకి వేస్తున్నట్లు తెలుస్తున్నది , కాబట్టి ఆ కార్యాలయాల అధికారులు ఆ విధంగా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని క్యాంటీన్ నిర్వా హకులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరియు జంతువులను ఆకర్షించే విధంగా తినుబండారాలు పడవే యరాదని ఆ విధంగా చేయనిచో వారిని ఖాళీ చేయించవలసి వస్తుందని హెచ్చరించారు.కలెక్టర్ కార్యాలయాల సముదాయం ను పరిశుభ్రంగా ఉంచే సూచనలు తెలుపు సైన్ బోర్డులు మరియు అవసరమైన ప్రదేశాలలో డస్ట్ బిన్ ల ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టరేట్ ఏవో జయశ్రీ ని ఆదేశించారు.ఈ సమావేశానికి ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిపిఓ భాస్కర్, డి సి ఓ రామాంజనేయులు ,డి ఆర్ డి ఎ పిడి వెంకటరమణయ్య, కలెక్టరేట్ ఏవో జయశ్రీ , ఇతర కార్యాలయాలు పరిపాలన అధికారులు పాల్గొన్నారు.