వృద్ధుడి సమస్య నెలలోపు పరిష్కరించాలి
1 min read– జేసీ -జిల్లా అధికారుల పేర్లు,సెల్ నెంబర్లు లేకపోతే ఎలా..?జేసీ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వృద్ధుడి పొలం సమస్యను నెలలోపు తప్పనిసరిగా పరిష్కరించాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం 11:38 నిమిషాలకు జాయింట్ కలెక్టర్ మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు.ఆయన కార్యాలయానికి వచ్చిన వెంటనే కార్యాలయం బయట(ఆర్టిఐ చట్టం)సమాచార హక్కు చట్టం ప్రకారం జిల్లా అధికారుల పేర్లు మరియు సెల్ నెంబర్లను ఎందుకు ఉంచలేదని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే ఇక్కడ అధికారుల పేర్లు మరియు సెల్ నెంబర్లను ఏర్పాటు చేయించాలని తహసిల్దార్ ప్రకాష్ బాబును జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.తరువాత జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు మరియు సోలార్ అధికారులతో సమావేశమయ్యారు. తదనంతరం ఆయన తిరిగి బయటికి వస్తూ ఉండగా సుంకేసుల గ్రామానికి చెందిన వృద్ధుడు బోయ నాయుడు సార్ నాకు సర్వే నంబర్ 266/ఏ లో 6:43 ఎకరాల్లో 1 ఎకరా 43 సెంట్ల పొలం మాకు ఉన్న పొలాన్ని ఈరన్న అనే వ్యక్తిపై ఆన్లైన్ చేయించారని పాత రికార్డుల్లో మా పేరు మీదనే ఉన్నాయని అంతే కాకుండా పొలాన్ని మేమే సాగు చేసుకుంటున్నామని బోయ నాయుడు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేస్తూ ఎన్ని సార్లు తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదనను వెళ్లగక్కారు.జాయింట్ కలెక్టర్ వృద్ధుడికి ఉన్న సమస్యను పూర్తిగా ఉన్న జేసీ వృద్ధుడి సమస్యను తప్పనిసరిగా నెలలోపు పరిష్కరించాలని తహసిల్దార్,ఆర్డీవో ను జేసీ ఆదేశించారు.అంతేకాకుండా వృద్ధుడు వివరాలు నమోదు చేసుకొని నెలలోపు ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అని నువ్వు చూడాలని జాయింట్ కలెక్టర్ సీసీ కి చెప్పారు.మిడుతూరు జగనన్న కాలనీలో రహదారి అధ్వానంగా ఉందని వర్షం పడితే రైతులు వెళ్లలేని స్థితిలో ఉంటుందని రహదారికి రోడ్డు వేయించాలని జాయింట్ కలెక్టర్ కు మిడుతూరు గ్రామ సర్పంచ్ వి.జయ లక్ష్మమ్మ వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ ఎం.దాసు,తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.