PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పున రుద్దరించాలి

1 min read

– ప్రాథమిక విద్యను  నిర్వీర్యం చేసే 117 జి. ఓ  ను వెంటనే రద్దు చేయాలి  ఫ్యాప్టొ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగ,ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి   పాదయాత్రలో ఇచ్చిన ఆమె మేరకు సిపిఎస్ ను రద్దు చేసిపాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరణ  చేయాలని,ప్రాథమిక విద్యా వ్యవస్థను  నాశనం చేసే జి. ఓ 117 ను వెంటనే రద్దు చేయాలని, FAPTO  రాష్ట్ర కో చైర్మన్ కె.ప్రకాష్ రావు ,రాష్ట్రకార్య వర్గ సభ్యులు జి.హృదయ రాజు జిల్లా చైర్మన్  ఎస్. గోకారి సెక్రెటరీ జనరల్ జి. తిమ్మప్ప లు ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. తేదీ 12 .8. 2023 న కర్నూలులో ధర్నా చౌక్ దగ్గర FAPTO  రాష్ట్ర కమిటీ మేరకు  FAPTO  జిల్లా చైర్మన్ యస్ గోకారి అధ్యక్షతన  12 గంటల సామూహిక నిరసన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమములో యు  టి ఎఫ్ రాష్ట్ర సహద్యక్షుడు  సురేష్ కుమార్ ,జిల్లా అధ్యక్ష  ప్రధాన కార్యదర్శుల ఏళ్ళప్ప, జయరాజు, ఏస్  టి యు  రాష్ట్ర అదనపు కార్య దర్శి సి.నాగరాజు,రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కే జనార్థన్.ఏ  పి టి ఎఫ్ 257  రాష్ట్ర కార్యదర్శి రవి కుమార్,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగన్న, నాగరాజు, హెడ్మాస్టర్ అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి నారాయణ , ఏ పి టి ఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యస్. ఇస్మాయిల్ ,మరియా ఆనందం ఆప్టా రాష్ట్ర కార్యదర్శి మధుసుదన రెడ్డి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సేవా నాయక్ ,రాజా సాగర్ , డి  టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్ర శేఖర్ ,జిల్లా అధ్యక్షుడు కృష్ణ, బి టి ఎ రాష్ట్ర కార్యదర్శి మాదన్న,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ సుధాకర్, ఏ  పి సి పి ఎస్ ఇ ఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగా రెడ్డి తది తరులు పాల్గొని మాట్లాడారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రస్తుత  గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత Y.S జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో గల్లీ గల్లీ న మేము అధికారంలోకి వస్తే ఒక వారంలోపే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు, ఉద్యోగులకు సంబంధించిన డి.ఏ లను పెండింగ్లో పెట్టమన్నారు. ప్రభుత్వం ఏర్పడి ప్రస్తుతానికి నాలుగు సంవత్సరాలు పైబడినప్పటికీ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయలేదన్నారు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు తీరా ఓ పి ఎస్ సాధ్యం కాదు అని  జిపిఎస్ ను అమలు చేస్తామన్నడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలలో ఎటువంటి హామీలు ఇవ్వకుండా , ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చకుండా, రాజస్థాన్ ,చతిస్గడ్, జార్ఖండ్ పంజాబ్ ,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే దిశలో ఉన్నారన్నారు. అక్కడ సాధ్యమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రాథమిక విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటటువంటి జీవో నంబర్ 117 వలన ఈ సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గిపోయిందని బడుగు బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమయ్యారని తెలిపారు.జి.ఓ.117 ను వెంటనే రద్దుచేయాలని అన్నారు. గత జూన్ జూలై మాసాలలో రాష్ట్రవ్యాప్తంగా 7000 పాఠశాల సహాయకులు, 900 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు 679 ఎంఈఓ 2 పోస్టులను పదోన్నతులు ,బదిలీల ద్వారా గందరగోళ పరిస్థితులలో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా భర్తీ చేశారని, వారికి ప్రస్తుతం రెండు నెలల గడుస్తున్నా కేడర్ స్ట్రెంత్ అప్డేట్ కాక జీతాలు రానటువంటి పరిస్థితి నెలకొందని వారు నెల నెల కట్టేటువంటి గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు ఇంటి అద్దెలు చెల్లించలేక అపరాధ రుసుముల కడుతూ మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. వెంటనే కేడర్స్ టెన్త్ను అప్డేట్ చేసి వారికి జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు పర్యవేక్షణ పేరుతో  సమాజంలో ఉపాధ్యాయులను చిన్నచూపు చూపే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. గత చరిత్రలో ఎన్నడూ చూడలేని విధంగా పి ఆర్ సి డి ఏ బకాయిలను నాలుగు సంవత్సరాలలో  వాయిదాల పద్దతిలో చెల్లిస్తామనడం  విడ్డూరంగా ఉందని వాటిని ఏక మొత్తంగా  చెల్లించాలని డిమాండ్ చేశారు.బోధనకు ఆటంకంగా ఉన్నటువంటి యాప్లను వెంటనే రద్దు చేయాలని , ఫేషియల్ అటెండెన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించాలని ,పిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు సమస్యను వెంటనే పరిష్కరించాలని , ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్  అన్ని ఆసుపత్రులలో అమలు అయ్యేవిద ముగా చర్యలు తీసుకోవాలని, ఆగిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్   ఇంగ్లీష్,తెలుగు, హిందీ ఉర్దూ పదోన్నతులను పూర్తి చేయాలని , ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి జూనియర్ లెక్చరర్ గా పదోన్నతులు కల్పించాలని,జీవో నెంబర్ 145 సవరించి రాబోయే పదోన్నతులలో సీనియర్ ఉపాధ్యాయులకు  న్యాయం చేయాలని ,కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటిఎస్ ను అమలు చేయాలని,మున్సిపల్ మరియు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఫ్యాప్టొ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో  పాఠశాల విద్యా శాఖ కార్యాలయమును ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  ఫ్యాప్టో సభ్య సంఘాల రాష్ట్ర/ జిల్లా /మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author