వృద్ధురాలి కాళ్లు పట్టుకుని.. క్షమాపణ కోరిన మంత్రి !
1 min readపల్లెవెలుగువెబ్ : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ రోడ్డు విస్తరణలో భాగంగా స్థానికి కూరగాయల మార్కెట్ వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. సంఘటనా స్థలానికి మంత్రి ప్రద్యుమ్న సింగ్ వచ్చారు. మంత్రిని చూసిన బాబినా బాయ్ అనే కూరగాయలు అమ్ముకునే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఉపాధి కలిగించే మార్కెట్‌ను మరో చోటుకు తరలించడంపై ఆమె కన్నీరు పెట్టుకుంది. అయితే ఆమెను శాంతింపజేయడానకి మంత్రి.. రోడ్డు, మార్కెట్ పరిస్థితిని వివరించాడు. అంతటితో ఆగకుండా కూరగాయలు అమ్ముకునే వారికి కలిగిస్తున్న అసౌకర్యానికిగాను ఆమె కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగారు. మార్కెట్ తరలింపు వల్ల ఇబ్బంది పెడుతున్నామని.. ఆమె చేతులు పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.