‘ట్రేడ్’ బకాయిలపై కొనసాగుతున్న కొరడా
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నగరంలో ట్రేడ్ లైసెన్స్‌లను పునరుద్ధరణ చేసుకొని వాణిజ్య దుకాణాలపై నగరపాలక అధికారుల కొరడా కొనసాగుతుంది. శుక్రవారం పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది కొత్త బస్టాండ్ సమీపంలో ట్రేడ్ లైసెన్స్ లేని దుకాణాలను సీజ్ చేశారు. మొండి బకాయి దుకాణాల వద్ద శాంతియుత నిరసన తెలిపారు. పునరుద్ధరణ చేసుకొని దుకాణదారులకు పువ్వులు అందజేసి, వెంటనే పునరుద్దించుకోవలసింగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. వాణిజ దుకాణదారులకు నగరపాలక ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అని, ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారస్తులు నగరపాలకకు సహకరించాలని, తమ ట్రేడ్ లైసెన్స్‌ను పునరుద్ధరణ చేసుకొని దుకాణదారులు వెంటనే చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య తనిఖీదారుడు యువరాజు పాల్గొన్నారు.