మానవత్వం చాటుకున్న మంత్రాలయం ట్రావెల్స్ యజమానులు
1 min read
డ్రైవర్ సంగమేష్ కుటుంబానికి రూ 31 వేలు నగదు, 25 కేజీల బియ్యం ఆర్థిక సహాయం
పల్లెవెలుగు, న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో డ్రైవర్ సంగమేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి సోమవారం మంత్రాలయం ప్రైవేటు వాహనాల యజమానులు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమేష్ సుమారు 20 సంవత్సరాల నుండి ప్రైవేటు వాహనాల డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, జనవరి మాసంలో 25 వ తేది న అనారోగ్యంతో మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మంత్రాలయం ప్రైవేటు వాహనాల యజమానులు మానవత్వం తో డ్రైవర్ సంగమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని మంచి మనసుతో ఆలోచించి యజమానులతో చందాలు సేకరించారు.చందాల రూపంలో సేకరించిన మొత్తం డబ్బు ను సుమారు 31,000/- రూపాయలను సంగమేష్ భార్య కు అందించారు.అంతేకాకుండా యజమానులు 25 kg ల బియ్యం పాకెట్ ను అందించారు.ఈ కార్యక్రమంలో వడ్డే.నారాయణ, సాంబశివ గౌడ్,అమీన్ భాష, నరేష్, వడ్డే.వెంకట్ రాజు,రఘు,ఈషా,విజయ్, మాధవరం రఘు,ఎల్లా, ఖాజా, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.