NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండియ‌న్ క్రికెట‌ర్ ను ఆకాశానికెత్తిన పాక్ క్రికెట‌ర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిదీ కూడా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యాడు. అంతేకాదు, పాండ్యాను ఆకాశానికెత్తేశాడు. హార్దిక్ పాండ్యాకు సరితూగే ఆటగాడు ఒక్కరు కూడా పాకిస్థాన్ జట్టులో లేరని అన్నాడు. పాక్ జట్టుకు ఆసిఫ్ అలీ, ఖుష్ దిల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరూ హార్దిక్ పాండ్యా ఆడినంత నిలకడగా ఆడలేకపోతున్నారని పేర్కొన్నాడు. “మాకు కూడా హార్దిక్ పాండ్యా వంటి ఫినిషర్ కావాలి. బ్యాటింగ్ లోనూ రాణిస్తూ, బౌలింగ్ లోనూ కీలకంగా ఉన్న పాండ్యా ఎంతో నమ్మకస్తుడైన ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకున్నాడు. పాకిస్థాన్ జట్టులోని ఆసిఫ్ అలీ, ఖుష్ దిల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లలో కనీసం ఇద్దరైనా నిలకడగా ఆడితే జట్టుకు ఉపయోగం. షాదాబ్ ఓవర్లు విసిరే సమయం ఎంతో కీలకం. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో రాణించాలంటే మాత్రం పాక్ తన లోపాలను పూడ్చుకోవాల్సిందే” అని అఫ్రిదీ అభిప్రాయపడ్డాడు.

                                          

About Author