పరిషత్ ఎన్నికలు యథాతథం
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో ఈనెల 8న జరగాల్సిన పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు. ..యథాతథంగా ఎన్నికలు జరపాలని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పు మీద ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఎస్ఈసీ పిటిషన్ డివిజన్ బెంచ్ విచారణకు తీసుకుంది. పిటిషనర్ పోటీ చేస్తున్న అభ్యర్థికాదని, సింగిల్ బెంచ్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పిటిషన్ కొట్టేయాల్సిందని ఎస్ఈసీ కోరింది. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న నిబంధనలేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఏ సందర్భంలో ఆ తీర్పు వెలువరించిందో పరిగణించాలని ఎస్ఈసీ కోరింది.