బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ
1 min read
కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప ,ఉరుకుంద మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శివ మోహన్ రెడ్డి ,
కౌతాళం, న్యూస్ నేడు : మండల కేంద్రంలోని కార్యక్రమం నిర్వహించగా బడుగు బలహీన వర్గాలు కోసం పనిచేయడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉప అధ్యక్షులు చెన్న బసప్ప, మోహన్ రెడ్డి , తెలిపారు. జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పేద ప్రజలకు సేవ చేయడానికి, బడుగు బలహీన వర్గాలు కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి,అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం అన్నారు. పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44 వసంతాలుగా అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో , జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, రమేష్ గౌడ్ , కురుగోడు , కుమ్మలనూరు సర్పంచ్ వీరెష్ , కుంటనహాల్ దొడ్డన గౌడ్ ,బాపూరం వెంకటరెడ్డి ,రౌడూరు అలీ సాబ్ ,మంజునాథ ఉప్పర హాలు రంగప్ప , రామ, మైనారిటీ నాయకులు రెహమాన్ , సిద్దు , రాజబాబు , టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.