అభివృద్ధి పథంలో చెన్నూరు మండలం
1 min read– 9 కోట్ల 80 లక్షలతో పూర్తయిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేయడ మేకాకుండా ఆదర్శ మండలం గా నిలిపేందుకు తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శనివారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి మెయిన్ రోడ్డు వద్దనుండి, పుష్పగిరి వరకు తొమ్మిది కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించిన డబల్ రోడ్డును కలెక్టర్ విజయరామరాజుతో కలసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెన్నూరు మండలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు, ఇందులో భాగంగా ఉప్పరపల్లె మెయిన్ రోడ్డు నుండి, పుష్పగిరి వరకు( ఎం డి ఆర్) 9 కోట్ల 80 లక్షల రూపాయలతో నిధులతో డబల్ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందన్నారు, ఇందులో రెండు బ్రిడ్జిలు కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు, ఒకటి ఉప్పరపల్లి శివాలయం వెనుక భాగంలో, మరొకటి శివాలపల్లె వంక వద్ద నిర్మించడం జరిగిందన్నారు, అంతే కాకుండా రిటైర్డ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎర్ర సాని మధుసూదన్ రెడ్డి( స్థల దాత) సహాయ సహకారాలతో రైతులకు ధాన్యాన్ని నిలువ ఉంచుకునేందుకు 80 లక్షల రూపాయలతో 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ను నిర్మించడం జరిగిందన్నారు, మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ సచి వాలయాలు, వైయస్సార్ పాల కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వైయస్సార్ విలేజి హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాల తో పాటు, ప్రజల వద్దకే ప్రభుత్వం అనే విధానంతోపనిచేయడంజరుగుతుందన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్న అక్కడి ప్రజలు, అధికారులు ,ప్రజాప్రతినిధులు ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన సాగుతోందని, అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, అదేవిధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి కుల మతాలకు అతీతంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రద్యుమ్న, రిటైర్డ్ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎర్ర సాని మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, ఆర్డీవో మధుసూదన్, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ఎస్ ఈ పి మహేశ్వర్ రెడ్డి, ఈ ఈ బి. ప్రభాకర్ నాయుడు, డి ఈ డి కళ్యాణి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ గీతా రాణి,ఎస్ఈ శివకుమార్, మండల వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, ఎంపీపీ,చీర్ల సురేష్ యాదవ్, ముది రెడ్డి రవి రెడ్డి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ ఎర్రసాని నిరంజన్ రెడ్డి, సర్పంచ్ ముమ్మడి సుదర్శన్ రెడ్డి, పుల్లయ్య యాదవ్, తహసిల్దార్ పటాన్ అలీ ఖాన్, డి ఎఫ్ ఓ సుధీర్, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.