జాతీయ రహదారి విస్తరణ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
1 min read– కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎంపీపీ చీర్ల
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కడప- కర్నూల్ జాతీయ రహదారి(40) విస్తరణలో భాగంగా చెన్నూరు కొత్త రోడ్డు పైన అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయరామరాజుకు వినతి పత్రం అందజేసినట్లు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు, సోమవారం సాయంత్రం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు కడప కర్నూలు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొత్త రోడ్డు ఇరువైపులా ఇండ్లు ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ విజయరామరాజును కోరినట్లు ఆయన తెలిపారు, వెంటనే స్పందించిన కలెక్టర్ కనపర్తి లేఅవుట్లలో జాతీయ రహదారి బాధితులకు మూడు సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు, అంతేకాకుండా చెన్నూరు కొత్త రోడ్డు నుండి పెన్నా నది వరకు 650 మీటర్లు డ్రైనేజీ పనులు, అలాగే సర్వీస్ రోడ్డు పనులు, బస్ షెల్టర్ కోరడం జరిగిందని ఆయన తెలిపారు, మండలం లోని శివాలపల్లె వద్దనుండి, ఓబులంపల్లె వరకు కేసీ కెనాల్ సైడ్ వాల్ దెబ్బతిన్నడంతోపాటు, కె సి కెనాల్ లో వ్యర్థాలు వేయడం వల్ల దుర్వాసన వేద జల్లు తున్నదని, సైడ్ వాల్ తో పాటు, చెన్నూరు సరస్వతి నగర్ వద్ద నుండి, అరుంధతి నగర్ వరకు కంచ వేయాలని తెలిపినట్లు ఆయన తెలిపారు, అలాగే మండలంలోని బయనపల్లి, కనపర్తి, బలసింగాయ పల్లి, దౌలాతాపురం, ఎస్టీ రామాపురం పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పీహెచ్ సీని కనపర్తి లేఅవుట్లో మంజూరు చేయాలని కోరినట్లు ఆయన తెలియజేశారు, అలాగే చెన్నూరు సమస్యలన్నీ కూడా ఆయనకు వివరించినట్లు ఎంపీపీ తెలిపారు, సావధానంగా సమస్యలు విన్న కలెక్టర్ విజయరామరాజు ఈ సమస్యల పైన ఆగస్టు 21వ తేదీన జాతీయ రహదారి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.