జగన్ ను ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురుచూస్తున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ను ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందుకే ఆయనకు భయం పట్టుకుందన్నారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి జగన్ కన్నా టీడీపీ హయాంలోనే సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేశామని వివరించారు. ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 51 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.