నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లు
1 min read
ప్రజల అండ ఉన్నంత వరకు మాకు తిరుగు లేదు
చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’
క్యూర్ కోడ్ ద్వారా గ్రామాల్లో పర్యటించి సీఎం చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం, న్యూస్ నేడు: మంత్రాలయం నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లని వారి అండ ఉన్నంత వరకు మాకు తిరుగు లేదని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో కర్నూలు వైకాపా జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి అధ్యక్షతన వైకాపా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా దివంగతి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , నియోజవర్గ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి , జిల్లా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ ఏడాది పూర్తయినా, అభివృద్ధి,సంక్షేమం శూన్యం అన్నారు. కూటమి పాలనలో అంతా చీకట్లు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల జీవితాల్లో చీకట్లు నింపిందని తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు వై సీతారామి రెడ్డి, వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, నాలుగు మండలాలు కన్వీనర్లు నియోజవర్గ,మండల,గ్రామాల, అన్ని విభాగాల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.