సిరి… సంపదలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి : జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సిరి, సంపదలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గణనాథుడిని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన వేడుకున్నారు.మంగళవారం రాంబొట్ల దేవాలయం నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణనాథుడిని తొమ్మిది రోజుల పాటు భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లా ప్రజలు అందరూ సిరి, సంపదలతో ఉండేలా చూడాలని వేడుకున్నారు. రాంబొట్ల దేవాలయం నందు గణనాథుడి లడ్డు వేలం పాటలో లడ్డును రూ.2లక్షల 6వేలకు డా.బైరెడ్డి శబరి లడ్డును దక్కించుకున్నారు. అనంతరం రాంబొట్ల దేవాలయం ప్రాంగణంలో కర్నూలు మరాఠ సేవ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు డా.బైరెడ్డి శబరి, 44వ వార్డు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.