యువనేతను కలిసిన తుమ్ములూరు ప్రజలు..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం తుమ్మ లూరు గ్రామప్రజలు శుక్రవారం యువనేత లోకేష్ ను యువగళం పాదయాత్ర లో కలిసి వినతిపత్రం సమర్పించారు.టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకు ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు.మంచి నీటి సరఫరాకు అదనంగా ట్యాంకర్లు నిర్మించాలి. వ్యవసాయానికి అనుంబంధ పరిశ్రమగా కోళ్లు, పాడి పెంపకాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు 98, 68 జీవోలు అమలు కావాలి. మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి, మరుగుదొడ్లను నిర్మించాలి.గతంలో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీగోడ మంజూరైంది. దాని పక్కన పంటకాలువకు సమాంతరంగా 200 మీటర్ల సైడుకాల్వను నిర్మించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. పాములపాడు నుండి మా గ్రామానికి రోడ్లవెంట వీధిలైట్లు కల్పించాలని లోకేష్ ను కోరారు.నారా లోకేష్ మాట్లాడుతూ..పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు 98, 68 జీవోలను ఇప్పటికీ అమలుచేయకపోవడం బాధాకరం. అధికారంలోకి వచ్చాక శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయంచేస్తాం. వ్యవసాయానికి అనుబంధంగా టీడీపీ హయాంలో సబ్సీడీలో గేదెలు, పశుగ్రాసం, దాణా అందించాం. షెడ్ల నిర్మాణానికి రూ.లక్ష సబ్సీడీ అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తాం.పంచాయతీలకు రూ.8600 కోట్ల నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం.ఇంటింటికీ కుళాయి, మరుగుదొడ్డి అందించే కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు.