NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాహ‌నం సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పెండింగ్ చ‌లానాలు ఉన్న వాహ‌న‌దారులు రోడ్డెక్కాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఎక్కడ పోలీసులు ఆపుతారో.. ఎప్పుడు వాహ‌నాన్ని సీజ్ చేస్తారో అన్న భ‌యం వాహ‌న‌దారుల‌ను వెంటాడుతోంది. ఒక్క పెండింగ్ చ‌లానా ఉన్న వాహ‌నం సీజ్ చేయ‌వ‌చ్చని ఓ ట్రాఫిక్ అధికారి స్టేట్ మెంట్ ఇవ్వడంతో వాహ‌న‌దారుల భ‌యం ఇంకా పెరిగింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు మార్గదర్శకాలు వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌నిచ్చాయి. త‌న వాహ‌నాన్ని సీజ్ చేయ‌డం పై ఓ న్యాయ‌వాది హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేశారు. విచారించిన హైకోర్టు పోలీసుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చ‌ట్టప్రకారం వాహ‌నం సీజ్ చేయ‌కూడ‌ద‌ని స్పష్టం చేసింది. వాహానాన్ని స‌ద‌రు య‌జ‌మానికి తిరిగి ఇవ్వాల‌ని ఆదేశించ‌డంతో పోలీసులు వాహనాన్ని తిరిగి ఇచ్చారు.

About Author