పోలీసులకు ఆ దమ్ము లేనట్టుంది !
1 min readపల్లెవెలుగువెబ్ : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహమాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా పేర్లను సైతం చేర్చారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులు సైడ్‌ఇజం లేదా బ్యాలెన్స్ వాద్ సిండ్రోమ్స్‌తో బాధపడుతున్నట్లు ఉన్నారు. ఒక పక్క ప్రవక్తను బాహాటంగా అవమానించారు. మరో పక్క బీజేపీ మద్దతుదారులను మభ్యపెట్టడానికి.. రెండు వైపులా ద్వేషపూరిత ప్రసంగం ఉన్నట్లుగా చూపిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. ` నా వరకు ఎఫ్‌ఐఆర్‌లో నేరం ఏంటో కూడా పేర్కొనలేదు. ఇలా ఎఫ్‌ఐఆర్‌ను చూడడం ఇదే మొదటిసారి. విద్వేషపూరిత ప్రసంగాలను విమర్శించడం.. విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం ఒక్కటి కాదు. ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై కేసులు పెట్టే దమ్ములేనట్లు ఉంది. అందుకే విషయాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు
అని అన్నారు.