మైనర్ డ్రైవింగ్ లపై ..స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం గారి ఆధ్వర్యంలో కర్నూల్ ట్రాఫిక్ పోలీసులు కర్నూలు నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనల పై ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కర్నూల్ నగరంలోని రాజ్ విహార్ , సెంటర్లో మోటారు వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ , డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న 21మంది మైనర్ల పై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కేసులు నమోదు చేసి రూ. 32235 జరిమానా విధించడం జరిగింది.మైనర్ డ్రైవింగ్ చేసిన వాహనదారులకు కర్నూల్ నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ,త్రిబుల్ రైడింగ్ వెళ్లకూడదు, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, రాంగ్ రూట్ వెళ్లకూడదని, త్రిబుల్ రైడింగ్ పోకూడదు, హెల్మెట్ ధరించవలెనని ,రోడ్డు ప్రమాదముల వలన నష్టముల గురించి కర్నూల్ ట్రాఫిక్ డీఎస్పీ గారు వివరించారు.ప్రత్యేకంగా మైనర్ డ్రైవింగ్ చేసిన వాహన చోదకుల తల్లిదండ్రులను పిలిపించి వారికి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పడం జరిగిందన్నారు .అంతే కాకుండా మైనర్లచే ఇంకెప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించము అని ప్రతిజ్ఞ చేయించారు.