పండుగ సందర్భంగా పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక వాయిదా
1 min read– జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అక్టోబర్ 23 వ తేది సోమవారం విజయదశమి (దసరా) పండుగ (ప్రభుత్వ సెలవు దినం కావడంతో) సంధర్బంగా కర్నూలు కొత్తపేటలో ని కర్నూల్ రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరగబోయే ” పోలీసు స్పందన కార్యక్రమము”ను తాత్కలిక వాయిదా వేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో కర్నూల్, కొత్తపేటలోని- కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరగబోయే జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమం కు రావొద్దని తెలిపారు.జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.