శాంతి భద్రతల సంరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు సేవలందిస్తారు
1 min read
జిల్లా ఎస్పీ కె శివప్రతాప్ కిషోర్
సర్వారాయ సుగర్స్ వారి సహకారంతో జిల్లా ఎస్పీ కి డ్రోన్ అందజేత
జి వివి సత్యనారాయణ ఫ్యాక్టరీ మేనేజర్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతైనా అవసరం
సహకరించిన పోలీస్ సిబ్బందికి ఎస్పి అభినందనలు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు జి వి వి సత్యనారాయణ,ఫ్యాక్టరీ మేనేజర్ సర్వారాయ షుగర్స్ లిమిటెడ్,బాట్లింగ్ యూనిట్ (కోకాకోలా) గోపాలపురం,పి కన్నపురం. ఎన్ శ్రీనువాసు, క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ వారి యొక్క సహకారంతో డ్రోన్ ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి కి అంద చేసిన బాట్లింగ్ యూనిట్, కోకాకోలా అధికారులుఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సౌజన్యంతో డ్రోన్ ని ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి అంద చేసినారు. సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఛాంబర్ లో ఈ డ్రోన్ ను కోకో కోల బాటిలింగ్ యూనిట్ సిబ్బంది జిల్లా పోలీస్ యంత్రాంగానికి అందచేయడంజరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల శాంతి, భద్రత పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు సేవలందిస్తుండగా, ప్రభుత్వ సహాయంతో పాటు ప్రజల మద్దతు కూడా లభించడం ఎంతో ప్రోత్సాహకరమైన అంశం అని పేర్కొన్నారు. పోలీస్ శాఖకు ప్రజల సహకారం లభించడం ఆనందించదగిన విషయం అని, డ్రోన్ ను పోలీస్ శాఖకు అందజేయడానికి కృషి చేసిన ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సహకరించిన అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ డ్రోన్ ఆధునిక ట్రాఫిక్ పర్యవేక్షణ, గస్తీ, మరియు అత్యవసర పరిస్థితుల్లో అత్యంత ఉపయోగపడుతుందని, భద్రతా చర్యలను మరింత సమర్థంగా అమలు చేయడానికి ఇది పోలీస్ శాఖకు సహాయపడుతుందని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలోఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ యు.జే. విల్సన్, ఎస్‌ఐ సుదీర్ బాబు, కోకో కోలా బాటిలింగ్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.