నిర్లక్ష్యానికి పేదలు బలి
1 min read– పట్టాలు ఇచ్చారు భూములు చూపించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం:
– శివ నాగమణి -నాలుగవ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట గతంలో ఇంటి పట్టాలు ఇచ్చారు కానీ ఇంతవరకు పొలాలు చూపించలేదని పొలాలు చూపించాలని కోరుతూ మిడుతూరు గ్రామానికి చెందిన దళితులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నాలుగవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈసందర్భంగా వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.శివ నాగరాణి మాట్లాడుతూ దళితుల ఓట్ల కోసం 27 సంవత్సరాల క్రితం పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి ఇంతవరకు భూములు చూపకపోవడం విచారకరమని స్వామి అన్నారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలు బలైపోతున్నారని మిడుతూరు మండల కేంద్రంలోని దళితులు బీసీలకు 46 కుటుంబాలకు 1996లో పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు. బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు.కానీ భూములు చూపకుండా అధికారులు కాలయాపన చేయడం విచారకరమన్నారు. పట్టాలిచ్చిన పేదలకు భూములు చూపేవరకు వ్యవసాయ కార్మిక సంఘం అండగా ఉంటుందని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నాగేశ్వరావు,ఎం సుధాకర్, జిల్లా నాయకులు ఆర్ ఈశ్వరయ్య,బాలయ్య,పక్కీరు సాహెబ్,నరసింహ నాయక్, ఈశ్వరమ్మ,డేవిడ్,ఓబులేష్,ఎం. కరణ,శ్రీనివాసులు మరియు దళితులు పాల్గొన్నారు.