ఉద్యోగుల డిమాండ్ల పై స్పష్టత వచ్చే అవకాశం : సజ్జల
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ఉద్యోగులు వివిధ డిమాండ్లతో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వం పై ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశం పై చర్చించాల్సి ఉందన్నారు. ఫిట్ మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీసీఏ చేయవద్దని ఉద్యోగులు అడిగారని తెలిపారు. హెచ్‌ఆర్ఏ శ్లాబుల్లో సవరణలతో ఏడు వేల కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. హెచ్ఆర్ఏలో పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు అడిగారని, కనీస హెచ్ఆర్ఏ 12 శాతం ఉండాలని అడిగినట్లు సజ్జల పేర్కొన్నారు.