ప్రధాని పదవి ఖాళీగా లేదు
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధాన మంత్రి పదవి ఖాళీగా లేదని భారతీయ జనతా పార్టీ చెప్పింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. నితీశ్ కుమార్ బిహార్‌ను చురుగ్గా అభివృద్ధి చేసి ఉంటే, అనేక మంది బిహారీ యువతీయువకులకు ఉద్యోగావకాశాలు లభించి ఉండేవని పేర్కొంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ సుమారు ఓ నెల క్రితం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.