PRC జీవో ను వెంటనే రద్దు చేయాలి
1 min readఉద్యోగులతో మళ్ళీ చర్చించాలి … వారు లేకుండా ప్రభుత్వం పని చేయలేదు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదని…. ఎనిమీ గవర్నమెంట్‌గా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఫిట్మెంట్, హెచ్ఆర్ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు మౌర్య ఇన్ హోటల్లోని పరిణయ ఫంక్షన్ హాల్లో కర్నూలు జిల్లా అధ్యక్షులు కోనంకి రామస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజుతోపాటు రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్ , ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి డా. పార్థసారధి, బీజేపీ సీనియర్ నాయకులు హరీష్ బాబు, ఆదోని నియోజకవర్గ ఇన్చార్జ్ విట్టారమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ ఉద్యోగులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేదన్నారు. ఉద్యోగులు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి.. ఉద్యోగులను మళ్లీ చర్చకు పిలిపించి.. సామరస్యంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు.