దేశం విడిచిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యాకు వెన్నుచూపకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచినట్టు రష్యా మీడియా పేర్కొంది. జెలెన్ స్కీ ఉక్రెయిన్ వదిలి పోలండ్ కు వెళ్లినట్టు రష్యన్ మీడియా పేర్కొంది. జెలెన్ స్కీను హత్య చేసేందుకు వందలాది ప్రైవేటు సైన్యం కీవ్ లోకి ప్రవేశించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జెలెన్ స్కీ పై మూడు సార్లు హత్యా యత్నం జరిగిందని, ఉక్రెయిన్ సేనలు ముందుగానే పసిగట్టి దుండగుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ తెలిపింది. అయితే.. జెలెన్ స్కీ దేశం విడిచారన్న వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.