NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా తేనే నాగరాజు

1 min read

నాయకుల చేతుల మీదుగా నియామకపత్రం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: యూత్ కాంగ్రెస్ నందికొట్కూరు  నియోజకవర్గ అధ్యక్షులుగా  తేనే నాగరాజు  నియామకం అయ్యారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన తేనే నాగరాజును నియమించారు. బుధవారం  కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు  చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు  మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ నాయకుల  సహాకారంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేస్తానని అన్నారు.యువత ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ  నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగడతానని అన్నారు. రానున్న  రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునర్వ వైభవం సాధిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీజెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఈ పదవికి  సహకరించిన  నందికొట్కూరు ప్రజలకు సేవ చేసేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్య నాయకులు నేషనల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్,  ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు , ఎన్ ఎస్ యుఐస్టేట్ అధ్యక్షులు నాగ మధు యాదవ్. నందికొట్కూరు  కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అశోక రత్నం  లకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author