PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రాన్ని ఐదేళ్లు గా పట్టిపీడిస్తున్న శని మరో నెల రోజుల్లో వీడనుంది

1 min read

సంక్షేమం కోసం వైసీపీ కంటే టీడీపీ నే ఎక్కువ ఖర్చు చేసింది

వైసీపీకి దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  కర్నూలు జిల్లా ప్రజలు రెండు సార్లు వైసీపీని నమ్మి ఆదరించారు. వైకాపా ప్రభుత్వం కర్నూలు జిల్లాకు చేసిన మేలు,అభివృద్ది పూర్తిగా శూన్యం. బీద రవిచంద్ర యాదవ్,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, శ్రీనివాసమూర్తి,నాగరాజు యాదవ్ లతో కలిసి పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్.ఈ సందర్భంగా బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ…నాలుగు సంవత్సరాల 11 నెలలు గా వైసీపీ సాగిస్తున్న రాక్షస పాలన ముగిసింది. మరో నెల రోజుల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయి.ఓదార్పు, బస్సు, పాదయాత్రలతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగన్ అధికారం లోకి వచ్చాక ఏనాడైనా ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు విన్నారా?అభివృద్ధి సంక్షేమం చూసి తనకు ఓటు వేయాలని కోరుతున్న జగన్ రాష్ట్రం లో తాను చేసిన అభివృద్ది ఏమిటో, టిడిపి ప్రభుత్వానికి మించి చేసిన సంక్షేమం ఏమిటో చెబితే బావుంటుంది.ప్రత్యేకహోదా, సీపీఎస్, విశాఖ ఉక్కుపై మాట్లాడలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్. పోలవరం పక్కన పెడితే కనీసం పిల్ల కాలవ సైతం తీయలేకపోయారు.రాయలసీమ ద్రోహి జగన్. టీడీపీ ప్రభుత్వం రాయలసీమలో జలవనరుల ప్రాజెక్టుల పూర్తి కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ చేసిన ఖర్చు కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే.హంద్రీనీవా కాల్వకు గండిపడితే పూడ్చలేకపోయారు. వేదావతి ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం అన్ని అనుమతులు తెచ్చి టెండర్లు పిలిస్తే వాటన్నింటిని రద్దు చేశారు.బటన్ నొక్కానని ఘనంగా చెప్పే జగన్ రైతన్నలకు ఒక్క పథకం సక్రమంగా అమలు చేసిన ధాఖలాలు లేవు. ఏ ఒక్క వర్గం రాష్ట్రం లో సంతోషం గా ఉన్నది లేదు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలన లో నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో తాగు నీటికి రూ.18వేల కోట్లకు అనుమతులు తెస్తే వాటిని కక్షపూరితంగా నిలిపివేశారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలోనైనా, ఏ నియోజకవర్గంలో నైనా ఒక్క తాగు నీటి పథకాన్ని పూర్తి చేయని జగన్మోహన్ రెడ్డి  కి ఎందుకు ఓటు వేయాలి ?క్రిస్టియన్లకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ఏం చేశారో చర్చించే దమ్ముందా? నిజంగా టీడీపీ కంటే మెరుగైన పథకాలు అందించామని చెప్పే ధైర్యం వైకాపా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉందా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పథకాలన్నింటిని  వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీకి మించి సంక్షేమానికి పథకాలు, నిధులు ఇచ్చి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి తామే కొత్తగా పథకం తెచ్చామంటూ వైసీపీ నేతలు డప్పులు కొట్టుకుంటున్నారు.టిడిపి పాలన ను విమర్శించే ముందు వైసీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు జరిగిన మేలు ఏమిటో వైసీపీ నాయకులు చెప్పాలి. దోపిడీలు, దాడులు, అరాచకాలే తప్ప అభివృద్ది ఎరుగని రాష్ట్రాన్ని వైసీపీ నుండి విముక్తి  చేయాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థిస్తున్నాం.టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి,సంక్షేమానికి బాటలు వేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం.

About Author