తిమింగలం వాంతి ధర రూ. 28 కోట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : తిమిగింలం వాంతికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కేజీ తిమింగలం వాంతికి సుమారు కోటి రూపాయల ధర పలుకుంది. దీన్ని ఎక్కువగా ఫర్ఫ్యూమ్‌ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన కొందరు మత్స్యకారులు ఎప్పటిలాగే శుక్రవారం కూడా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే అత్యంత విలువైన 28.4కిలోల తిమింగలం వాంతి వారి కంట పడింది. వెంటనే దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చిన మత్స్యకారులు.. స్థానికంగా ఉన్న కోస్టల్ పోలీసులకు అప్పగించారు. అధికారులు ఆ పదార్థాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. మత్స్యకారులకు దొరికింది నిజంగా తిమింగలం వాంతేనా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించడానికి ఫారెస్ట్ అధికారులు దాన్ని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి తరలించారు.