PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌బ్బుల ధ‌ర‌లు త‌గ్గాయి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: సబ్బుల తయారీలో వాడే పామాయిల్‌, ఇతర ముడి సరకుల ధరలు తగ్గడంతో హిందుస్తాన్‌ యూ నిలీవర్‌, గోద్రెజ్‌ కంపెనీలు సబ్బుల ధరలు 15 శాతం వరకు తగ్గించాయి. లైఫ్‌బాయ్‌, లక్స్‌ సబ్బుల ధరలు హెచ్‌యూఎల్‌ 5-11 శాతం తగ్గించగా గోద్రెజ్‌ నంబర్‌ 1 సబ్బు ధరను జీసీపీఎల్‌ 13-15 శాతం మేరకు తగ్గించింది. సబ్బుల ధరలు తగ్గించడంతో ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అమ్మకాలు పెరిగి కంపెనీలు మంచి ఆదాయా లు పొందేందుకు వీలు కలుగుతుందని విశ్లేషకులంటున్నారు.

                                           

About Author