పండగపూట కూడా తీరని నీటి సమస్య…వేసవిలో గొంతుండుతోంది..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో 3,4 వార్డులలో నీటి సమస్యకు తీవ్రతరమైంది.పండగ పూట ట్యాంకర్ బాడుగకు తెచ్చుకొని నీళ్లు కొంటున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు .గత కొన్ని నెలల క్రితం కుళాయి కనెక్షన్ కొరకు 1000/₹ తీసుకున్న నెలలు గడుస్తున్నాకూడా అధికారులు ఇంటింటికి నీళ్లు ఇచ్చే ఆలోచనే చేయడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజల అడిగేతే పైపులు ఇస్తాం మిరే కనెక్షన్ వేసుకోండి అని అధికారులు స్థానిక సర్పంచ్ బాధ్యత లేని మాటలు చెబుతున్నారని.గ్రామం కోసం వేయించిన బోర్లలో సర్పంచ్ కు సంబందించిన వారి పొలాల్లో నీళ్లు పెట్టుకోవటానికి వాడుకుంటున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామ ప్రజలకు నీళ్లు ఇచ్చేది లేదుకని, వాటితో వాళ్ళ సొంత పొలాలకు నీళ్లు మళ్లించుకుంటున్నారని.ఇదే విషయం పంచాయతీ సెక్రటరీ కి ఫిర్యాదు చేస్తే మాకు సంబంధం లేదని, అది గ్రామ సర్పంచ్ కు సంబంధం అని వాళ్ళుకూడా నిర్లక్ష్యం సమాధానం చెప్పుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం చూస్తే పల్లెటూర్లను ప్రగతి బాటలో నడిపిస్తున్నాం అని చెబుతుంటే, గ్రామాలలో మౌలిక సదుపాయాలు కూడా తీర్చలేకపోతే ఇక గ్రామ సర్పంచ్ ఎందుకు, అధికారులు ఎందుకు.త్వరగా మా వార్డుల్లో నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు లేదంటే ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.