NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి ‌

1 min read

‌– సిపిఐ యంయల్ఆర్ ఐ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ ‌ ‌ ‌‌
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం లో ‌కోవెలకుంట్ల మండలం కలుగోట్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కలుగోట్ల గ్రామంలో యసి కాలనిలో వున్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన స్కూల్ గేట్ విరగడానికి సిద్ధంగా వున్న అక్కడి సిబ్బంది గాని ఉపాధ్యాయులు గాని పట్టించుకోకపోవడం చాలా దారుణమని వారన్నారు అలాగే స్కూల్ పక్కన ఉన్న పాత భవనం కూలడానికి సిద్ధంగా వున్న కూడా అదికూడా పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు ప్రమాదం జరగక ముందే ఇలాంటి వాటిపై ముందుగానే చర్యలు తీసుకోవాలి లేకపోతే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు పొరపాటున అక్కడికి వెళ్తే జరగరానిది జరిగి తే ఎవరు బాధ్యత వ్యవహరిస్తారని ఆయన అధికారులను సూటిగా ప్రశ్నించారు అందుకే అధికారులు మొద్దునిద్ర వీడి ప్రమాదం జరగక ముందే మేల్కొని వాటిని తొలగించాలని లేని పక్షంలో విద్యార్థులుతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

About Author