PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అంగన్​వాడీ’ల సమస్యలను పరిష్కరించాలి

1 min read
మాట్లాడుతున్న మంజుల

మాట్లాడుతున్న మంజుల

– ఏఐటీయూసీ అనుబంధ అంగన్​వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంజుల
పల్లెవెలుగు వెబ్​, మైదుకూరు: క్షేత్రస్థాయిలో అంగన్​వవాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంజుల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. గురువారం మైదుకూరు మండలం లోని జీ.వి.సత్రం లో జీవి సత్రం సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. కేంద్రాల్లో నిర్వహించే కార్యకలాపాలను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్స్ సామర్థ్యం సరిపోవడం లేదని మొబైల్స్ ను మార్చాలని ప్రభుత్వ కార్యదర్శిని కోరినట్లు పేర్కొన్నారు. అంతేకాక కేంద్రాల్లో సరైన వసతులు లేవని, 55 ఏళ్ వరకు సూపర్​వైజర్​ పోస్టులు పొందేందుకు వెసలుబాటు కల్పించాలని కోరామన్నారు. అనంతరం సీపిఐ ఏరియా కార్యదర్శి పి. శ్రీరాములు మాట్లాడుతూ జీతాల పెంపు కోసం యూనియన్ పోరాడుతుందని , సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నందున అంగన్వాడీ కార్యకర్తలకు రోజుకు 710/-రూపాయల చొప్పున నెలకు 21,300 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తల సహాయకుల యూనియన్ మండల నాయకులు సంకులుగారిపల్లే లక్ష్మీదేవి, వరదాయ పల్లే లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author