PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​ పత్తికొండ : అపరిష్కృతంగా ఉన్న  అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్ప ర్స్ సమస్యలను పరిష్కరించాలని బుదవారం  ఎఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్ సిడిపిఓ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రంగన్న,నెట్టేకంటయ్య మాట్లాడుతూ, అంగన్వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని అన్నారు.సమస్యల పరిష్కారం కోసం అనేకమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే ఈ నెల  24 వ తేదీన అంగన్వాడీ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నిరాహార దీక్షలు చేపడు తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇలాగే వ్యవరిస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ  గౌరవ అధ్యక్షులు బి మాదన్న ఏఐటియుసి తాలూకా ఉపాధ్యక్షులు ఎం.రాజప్ప ఏఐటీయూసీ తాలూకా సహయకార్యదర్శి ఎం రామచంద్ర ఎఐటియుసి డిప్యూటీ కార్యదర్శి గుండు భాష  ,రవి తదితరులు పాల్గొన్నారు.

About Author